మహేష్‌ ఫ్యాన్స్ ని వెయిటింగ్‌లో పెట్టింది. `సర్కారు వారి పాట` సినిమా అప్‌డేట్‌ ఆలస్యమవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ నోట్‌ని సోషల్‌ మీడియా  ద్వారా  పంచుకున్నారు.

సూపర్‌ స్టార్‌ మహేష్‌(Maheshbabu) అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేవారు. ఆయన నటించిన `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata) సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కోసం వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్‌లో వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి అభిమానులను ఖుషీ చేసేందుకు టీమ్‌ ప్రయత్నించింది. ఇటీవల కూడా పండక్కి అప్‌డేట్‌ ఇస్తామని, సాంగ్‌ని రిలీజ్‌ చేస్తామని యూనిట్‌ తెలిపింది. కానీ Mahesh ఫ్యాన్స్ ని వెయిటింగ్‌లో పెట్టింది. `సర్కారు వారి పాట` సినిమా అప్‌డేట్‌ ఆలస్యమవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ నోట్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 

Scroll to load tweet…

ప్రస్తుతం కరోనా బాగా విస్తరిస్తుంది. అంతేకాదు ఏకంగా మహేష్‌బాబు కరోనాతో బాధపడుతున్నారు. హీరోయిన్‌ కీర్తిసురేష్‌కి వైరస్‌ సోకింది. అలాగే మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇలా `సర్కార్‌ వారి పాట` టీమ్‌లో చాలా మందికి కరోనా సోకిందని, దీంతో సినిమా నుంచి ఈ సంక్రాంతి అప్‌డేట్‌ రావడానికి ఆలస్యమవుతుందని తెలిపింది. ఎప్పుడనేది వెల్లడిస్తామి, అయితే పాట వెయింటింగ్‌కి సరిపడ వర్త్ తో ఉంటుందని, అప్పటి వరకు వెయిట్‌ చేయాలని వెల్లడించింది. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో మహేష్‌ అభిమానులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. సాంగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. అది ఎప్పుడొస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే మహేష్‌బాబు కరోనా నుంచి కోలుకున్నారనే వార్త వైరల్‌ అయ్యింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇక `గీతగోవిందం` ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారువారి పాట` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా నటిస్తున్నారు. థమన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమాని ఏప్రిల్‌ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ డేట్‌కి కూడా సినిమా వస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది.