మహేష్ పాకిస్తాన్ క్రికెటర్ తో మాట్లాడడం ఏమిటని అనుకుంటున్నారా? అభిమానులకు కొంచెం ఇది తేడా కొట్టినప్పటికీ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. హైరాబాద టెన్నిస్ సుందరి భర్త షోయబ్ మాలిక్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఇటీవల దుబాయ్ వెళ్లిన ఆ జంటను మహేష్ ఫ్యామిలీ కలిసింది. 

అక్కడికి మహేష్ - నమ్రత ఇద్దరి పిల్లలతో కలిసి ముందుగానే వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలను మొన్నటివరకు బాగా ఎంజాయ్ చేశారు. అయితే  అక్కడ సానియా మీర్జా కనిపించడంతో స్పెషల్ గా కలుసుకొని పార్టీని ఎంజాయ్ చేశారు. ఇక క్రికెటర్ షోయబ్ మాలిక్ మహేష్ తో కొంత సేపు ఫ్రెడ్లిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. 

వీరికి సంబందించిన గ్రూప్ ఫోటోను నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. మొత్తానికి మహేష్ ఫ్యామిలీ పర్సన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తోన్న మహేష్ ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.