ఎప్పటికీ మీరే సూపర్ స్టార్: మహేష్ బాబు

mahesh babu emotional tweet on his father super star krishna
Highlights

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను సృష్టించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తండ్రిని ఉద్దేశించి ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

''నా రియల్ హీరో, నా గురువు, నా దైవం, నా బలమైన పునాది.. నా సర్వస్వం మీరే.. మీ కుమారుడిగా గర్విస్తున్నాను. హ్యాపీ బర్త్ డే నాన్న.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్'' అంటూ మహేష్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్ లో ఉన్నారు. త్వరలోనే తన తదుపరి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. 

loader