దేశానికి రాజైనా.. తల్లికి కొడుకే అంటారు. అలాగే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మనకు సూపర్ స్టార్ అయినా.. తల్లి దగ్గర మాత్రం చిన్న పిల్లాడై పోతాడు. ఈరోజు (ఏప్రిల్ 20) తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఏమోషనల్ పోస్ట్ పెట్టాడు మహేష్.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తన తల్లి ఇందిరాదేవి అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. మహేష్ ఎక్కువగా తన అమ్మ అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. చిన్న తనంలో తన తండ్రి కృష్ణ షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు మహేశ్ ఎక్కువగా అమ్మ, అమ్మమ్మ ప్రేమానురాగాల మధ్య పెరిగాడు. అందుకే నాన్నతో కంటే అమ్మా, అమ్మమ్మతోనే మహేష్ కు అనుబంధం ఎక్కువ.
ఈరోజు మహేశ్ తల్లి ఇందిర పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా మహేష్ ఎమోషనల్ అయ్యారు. తనతల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియో స్పెషల్ పోస్టును పెట్టాడు. హ్యాపీ బర్త్ డే అమ్మా. నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కరోజు సరిపోదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాఅని ట్వీట్ చేశాడు సూపర్ స్టార్.
ఇప్పటికే చాలా సార్లు తన తల్లి గురించి పలు సందర్భాల్లో మాట్లాడాడు మహేష్ బాబు. తన భాల్యం గురించి బాలకృష్ణ షోలో కూడా ప్రస్తావించారు సూపర్ స్టార. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈసినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్ర మ్ తో సినిమాచేయబోతున్నారు. ఆతరువాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళితో కలిసి భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.