తండ్రిగా మహేష్ ? నడివయస్సు పాత్రలో... ?
ఇప్పటికే మహేశ్ పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించిన లీక్ బయిటకు వచ్చింది. అదేమిటంటే..

మహేష్ నడి వయస్సు పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటాడు. దాదాపు ప్రతీ సినిమాలోనూ తను తనలాగే అంటే ఒకే లాగ కనిపిస్తూంటాడు అని అభిమానులలో చిన్న పాటి నిరాశ ఉంది. ఎక్కువగా గెటప్స్ కు,లుక్స్ కు ప్రాధాన్యత ఇవ్వరు మహేష్. కానీ తాజాగా మహేష్ తండ్రి పాత్రలో అదీ నడివయస్సులో కనిపిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో రూపొందుతున్న గుంటూరు కారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్‍డేట్ల కోసం మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే మహేశ్ పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా ఈ సినిమా గురించిన లీక్ బయిటకు వచ్చింది. అదేమిటంటే..ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో పెద్దరికం గా కనపడే మిడిల్ ఏజ్ తండ్రి పాత్రలో మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని. ఆపాత్ర చాలా ఎమోషన్ తో పరవ్ ఫుల్ గా నడుస్తుంది అంటున్నారు. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు.
అలాగే ఈ సినిమాలో పొలిటికల్ నేపథ్యం కూడా ఉంటుంది. ఈ చిత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్ కాస్త లైట్‌గా టచ్ చేస్తారని అనుకుంటున్నారు.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని పూజా హెగ్డే స్థానంలో తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గుంటూరు కారం చిత్రంలో మీనాక్షి చౌదరి పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13, 2024న రిలీజ్ కానుంది. గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరీ రెండో హీరోయిన్‍గా ఉన్నారు. జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మానందం, మహేశ్ ఆచంట కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే గుంటూరు కారం మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. హారిక, హాసినీ క్రియేషన్స్ పతాకంపై గుంటూరు కారం సినిమాను చిన్నబాబు (ఎస్.రాధాకృష్ణ) నిర్మిస్తున్నారు.