నటిగా దర్శకురాలిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ నిర్మల మృతి చెందడం టాలీవుడ్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. సినీ ప్రేక్షకులు కూడా ఆమె మరణం పట్ల బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ సినీ నటులు సైతం దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. 

జయలలిత మరణం కారణంగా శుక్రవారం జరగాల్సిన మహర్షి 50 రోజుల విజయోత్సవ వేడుకను కూడా చిత్ర యూనిట్ క్యాన్సిల్ చేసింది. 200 సెంటర్లలో చాలా కాలం తరువాత మహేష్ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ వేడుకను ఘనంగా నిర్వహించాలని శిల్పాకళా వేదికను ఎంచుకుంది. 

అయితే విజయనిర్మల హఠాత్మరణంతో వేడుకను క్యాన్సిల్ చేయమని హీరో మహేష్ బాబు నిర్వహకులను ఆదేశించినట్లు సమాచారం. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు.