Asianet News TeluguAsianet News Telugu

మహేష్‌బాబు మరో భారీ మల్టీప్లెక్స్.. `ఏఎంబీ`ని మించి.. ఎక్కడో తెలుసా?

మహేష్‌బాబు ఇప్పుడు మరో మల్టీప్లెక్స్  నిర్మిస్తున్నారు. ఈ సారి `ఏఎంబీ`ని మించి ఉండబోతుందట. ఓ భారీ థియేటర్‌ స్థానంలో మహేష్‌ మల్టీప్లెక్స్ నిర్మిస్తుండటం విశేషం.

mahesh babu building one more huge multiplex here crazy details arj
Author
First Published Sep 17, 2023, 9:36 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నెమ్మదిగా వివిధ వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన క్లాత్స్ వేర్‌ బ్రాండ్‌ని నిర్వహిస్తున్నారు. మరోవైపు `ఏఎంబీ`తో సినిమా థియేటర్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మల్టీప్లెక్స్  నిర్మిస్తున్నారు. ఈ సారి `ఏఎంబీ`ని మించి ఉండబోతుందట. ఓ భారీ థియేటర్‌ని ఆయన నిర్మించబోతున్నారని తెలుస్తుంది. 

అయితే మహేష్‌బాబు, ఏసియన్‌ గ్రూప్‌(సునీల్ నారంగ్‌)తో కలిసి `ఏఎంబీ`ని నిర్వహిస్తున్నారు. మరోసారి ఈ ఇద్దరు కలిసి బెంగుళూరులో భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. అయితే అక్కడ ఓ చరిత్ర గల థియేటర్ స్థానంలో వీరి మల్టీప్లెక్స్ నిర్మిస్తుండటం విశేషం.  బెంగుళూరులో దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఫేమస్‌ కపాలి సినిమా థియేటర్‌ ని మూడేళ్ల క్రితమే కూల్చారు. బెంగుళూరులోని గాంధీనగర్‌లో ఈ థియేటర్‌ ఉంది. అక్కడ భారీగా మాల్‌ని నిర్మిస్తున్నారు. అందులో ఏఎంబీ మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తున్నారట. 

కన్నడ ఆడియెన్స్ ని ఐదు దశాబ్దాలుగా అలరిస్తుంది కపాలి థియేటర్‌. బెంగుళూరు సెంటర్‌లోని గాంధీ నగర్లో ఈ థియేటర్‌ ఉండటం ఓ విశేషమైతే, ఇది అతి పెద్ద థియేటర్‌ కావడం మరో విశేషం. దీంతో ఈ థియేటర్‌కి పెద్ద చరిత్రనే ఉంది. ఆ స్థానంలో మహేష్‌బాబు మల్టీప్లెక్స్ వస్తుండటంతో సినీ ప్రియుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. 

కపాలి థియేటర్‌ హిస్టరీ చూస్తే.. 1968లో సుబేదార్‌ చత్రం రోడ్డులో 44వేల చదరపు అడుగు విస్తీర్ణంలో ఈ కపాలి సినిమా నిర్మించారు. అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్‌ దీన్ని ప్రారంభించడం విశేషం. అప్పట్లోనే ఈ థియేటర్‌ని 1465సీట్ల కెపాసిటీతో నిర్మించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ గా రికార్డ్ సృష్టించింది. నాలుగేళ్ల క్రితం కపాలి థియేటర్‌ యాజమానులు దాసప్ప సోదరులు ఈ స్థలాన్ని బెల్గాం వ్యాపారికి విక్రయించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ జయన్న ఈ కాపాలి సినిమాను లీజుకున్నారు. ఐదేళ్ల లీజు అనంతరం థియేటర్‌ని అమ్మేశారు. 

కపాలి థియేటర్‌లో కన్నడ చిత్రాలే కాదు, హిందీ, ఇంగ్లీష్‌ మూవీస్‌ కూడా ప్రదర్శించబడేవి. రాజ్ కుమార్‌ నటించిన ఎన్నో సినిమాలు ఇందులోరిలీజ్‌ అయ్యాయి. దీంతో ఈ థియేటర్‌ని కన్నడ ఆడియెన్స్ ఓ ఎమోషన్‌గా ఫీలవుతారు. ఇక ఇందులో శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర కలిసి నటించిన `ఓం` చిత్రాన్ని ముప్పై సార్లు ఈ థియేటర్‌లో రిలీజ్‌ చేయడం విశేషం. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ సినిమా సీటింగ్‌ కెపాసిటీని 1112కి తగ్గించారు. చివరగా 2017లో `హులిరాయ` అనే చిత్రం ఈ థియేటర్‌లో ప్రదర్శించిన చివరి చిత్రంగా నిలిచింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios