మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'భరత్ అనే నేను' విజన్ వీడియో మంగళవారం విడుదలైంది విడుదలైన స్వల్ప కాలంలోనే ఈ టీజర్‌ యూట్యూబ్, ఫేస్ బుక్‌లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగుల దెబ్బకు... బాహుబలి మినహా ఇప్పటి వరకు టాలీవుడ్లో వచ్చిన ట్రైలర్, టీజర్ వ్యూస్ రికార్డులన్నీ బద్దలయ్యాయి.

 

మంగళవారం సాయంత్రం ‘భరత్ అనే నేను' టీజర్ విడుదలవ్వగా కేవలం 19 గంటల్లోనే 10 మిలియన్(కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఇదే ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్. ఇందులో 7 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా రాగా, 3 మిలియన్ వ్యూస్ ఫేస్ బుక్ ద్వారా వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘డివివి ఎంటర్టెన్మెంట్స్' ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

 

యూట్యూబ్ వ్యూస్ పరంగా ఇప్పటి వరకు ‘బాహుబలి-2' ట్రైలర్ నెం.1 స్థానంలో ఉంది. ఈ ట్రైలర్ 24 గంటల్లో 21.7 మిలియన్ వ్యూస్ సాధించింది.

 

మహేష్ బాబు మూవీ ‘భరత్ అనే నేను' యూట్యూబ్‌లో కేవలం 19 గంటల్లోనే 7 మిలియన్ పైగా వ్యూస్ సాధించి నెం.2 స్థానం దక్కించుకుంది.

 

యూట్యూబ్ వ్యూస్ పరంగా అజ్ఞాతవాసి టీజర్ 24 గంటల్లో 6.4 మిలియన్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. అజ్ఞాతవాసి ట్రైలర్ 6.2 మిలియన్ వ్యూస్ సాధించి 4వ స్థానంలో ఉంది.

 

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం' టీజర్ 24 గంటల్లో 5.9 మిలియన్ వ్యూస్ సాధించి 5వ స్థానంలో నిలిచింది.

 

 

జై లవ కుశ ఫస్ట్ టీజర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 5.4 మిలియన్ వ్యూస్ సాధించగా, రెండో టీజర్ 4.85 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని 6, 7వ స్థానంలో నిలిచాయి.

 

8వ స్థానంలో దువ్వాడ జగన్నాధం ‘దువ్వాడ జగన్నాధమ్' మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో 24 గంటల్లో 4.6 మిలియన్ వ్యూస్ సాధించింది.

 

మహేష్ బాబు గత చిత్రం ‘స్పైడర్' తొలి టీజర్ 24 గంటల్లో 4.2 మిలియన్ వ్యూస్ సాధించగా, రెండో టీజర్ 4 మిలియన్ వ్యూస్ సాధించి 9, 10 స్థానాల్లో నిలిచాయి.

ఈ క్రింద.. పవన్ ఇంట విషాదం.. వివరాలు..

 https://goo.gl/WHnKiy