స్టార్ హీరో ఫ్యాన్స్ ఎప్పుడూ తమ అభిమాన హీరో అగ్రస్థానంలో ఉంచాలని తాపత్రయ పడతారు. అందుకే తమ హీరో పేరున భారీ రికార్డ్స్ ఉండాలని కోరుకుంటారు. ఒకప్పుడు రికార్డ్స్ అంటే... సినిమా ఆడిన డేస్, సెంటర్స్, కలెక్షన్స్. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తరువాత ఫ్యాన్స్ సోషల్ మీడియా రికార్డ్స్ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరో సినిమాకి సంబంధించిన అప్డేట్స్, బర్త్ డే యాష్ టాగ్స్, టైటిల్, నేమ్స్ ట్రెండ్ చేస్తూ రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. 
 
ఆ మధ్య మహేష్ బాబు బర్త్ డే నాడు 60 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ తో ఫ్యాన్స్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. ఆ రికార్డుని పవన్ ఫ్యాన్స్ బర్త్ డే సిడీపితో బ్రేక్ చేశారు. కాగా 2020కి గాను సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరో పేరు ఎక్కువగా ట్వీట్ చేశారన్న విషయాన్ని ట్విట్టర్ ఇండియా తెలియజేసింది. తమ గణాంకాల ప్రకారం ఈఏడాదికి గాను మహేష్ పేరు ఎక్కువసార్లు ట్వీట్ చేశారట. మహేష్ తరువాత సౌత్ ఇండియా నుండి ఎక్కువసార్లు ట్వీట్ చేయబడిన స్టార్ గా పవన్ నిలిచాడు. 
 
ఇక మూడో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిలవడం విశేషం. ఆ తరువాత స్థానాలు ఎన్టీఆర్ మరియు సూర్య ఆక్రమించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాప్ ఫైవ్ లో లేకపోవడం విశేషం. ఏవిషయంలో అయినా తమ హీరో ముందు వరుసలో ఉండాలనుకునే పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ ని బీట్ చేయలేకపోయారు. సరిలేరు నీకెవ్వరు మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్, ఫాలోయింగ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.