మంచు వారి ఇంట్లో మహేష్‌బాబు దంపతులు సందడి చేశారు. మహేష్‌, నమ్రత కలిసి మంచు విష్ణుని సర్‌ప్రైజ్‌ చేశారు. మొత్తంగా అభిమానులను ఖుషీ చేశారు. శనివారం మంచు విష్ణు భార్య విరానిక మంచు పుట్టిన రోజు. ఈ సందర్బంగా విష్ణు పిలుపు మేరకు మహేష్‌ దంపతులు బర్త్ డే ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈవెంట్‌ని మరింత స్సెషల్‌గా మార్చారు. ఇందులో మహేష్‌బాబు, నమ్రతతోపాటు గోపీచంద్‌ ఇలా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 

ఈ సందర్భంగా ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. `ఫోటోలోని ఓ వ్యక్తి ప్రతి రోజూ యవ్వనంగా, అందం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అతని మంచి స్వభావం, దయగల హృదయం కారణంగానే అది సాధ్యమని నేను గట్టిగా నమ్ముతున్నా` అని తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు విష్ణు.