మహేష్ బాబు పోలీసులను కలిశాడు.. కారణమేమిటంటే.?

mahesh babu at telangana police academy
Highlights

కథలో భాగంగా మహేష్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడట. కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడే ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తెలంగాణ పోలీస్ అకాడమీకు వెళ్లి అక్కడ అధికారులను కలిసినట్లు తెలుస్తోంది. మహేష్ పోలీసులను ఎందుకు కలిశాడు అనుకుంటున్నారా..? దాని వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినీమాలో నటిస్తున్నాడు. ఇటీవలే డెహ్రాడూన్ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో మహేష్ కొంత సమయం పాటు గడ్డంతో కనిపించబోతున్నాడు. కథలో భాగంగా మహేష్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడట. కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడే ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి తాజాగా మహేష్ తన దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి తెలంగాణ పోలీస్ అకాడమీకు వెళ్లారు.

క్రికెట్ మ్యాచ్ తో పాటు ఆ తరువాత వచ్చే యాక్షన్ సీన్లను ఈ అకాడమీలో చిత్రీకరించడానికి అనుమతినివ్వాలని పోలీసులను కోరినట్లు సమాచారం. పోలీసులు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader