మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. సమ్మర్ లో సూపర్ స్టార్ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టడంతో మహర్షి యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. 

ఇక మహర్షి విజయోత్సవంలో భాగంగా రీసెంట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ కి వెళ్లిన మహేష్  అక్కడ అభిమానులను కలుసుకున్నాడు. అయితే మహేష్ రాకతో అభిమానుల మధ్య తొక్కిసలాట జారిగింది. జనాల్ని అదుపుచేయడానికి యాజమాన్యం బలం సరిపోలేదు. మహేష్ ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా చిన్న స్పీచ్ తో ప్రోగ్రామ్ ని ముగించాడు. 

ఇక మహేష్ మరోసారి కాలర్ ఎగరేసి సక్సెస్ ఇచ్చినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు అల్లరి నరేష్ - పూజ హెగ్డే - నిర్మాత దిల్ రాజు సుదర్శన్ థియేటర్ కి వచ్చారు. నెక్స్ట్ 18వ తేదీన చిత్ర యూనిట్ విజయవాడలో కూడా సక్సెస్ ని ఫ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకోవాడానికి సిద్ధమవుతోంది.