Asianet News TeluguAsianet News Telugu

ముంబయ్ లో డిన్నర్.. దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్, మహేష్ టీమ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌  మహేశ్‌ బాబు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా SSMB28. రకరకాల కారణాల వల్ల డిలై అవుతూ వస్తోన్న మూవీ షూటింగ్ ఈనెలలో స్టార్ట్ కాబోతోంది. దీని కోసం ముంబయ్ చేరిన మహేష్ టీమ్ అక్కడి నుంచి దుబయ్ వెళ్లబోతున్నారు. 
 

Mahesh babu and Trivikram Movie Shooting Update
Author
First Published Dec 7, 2022, 4:56 PM IST


చాలా కాలంగా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న  ఎస్‌ఎస్‌ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఏకంగా రగంలోకి దిగారు సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ టీమ్. తాజాగా రిలీజ్ అయిన  స్టిల్స్‌ తో ఎస్‌ఎస్‌ఎంబీ 28 గురించి చెప్పేసింది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ముందుగా ముంబయ్ చేరారు టీమ్. అక్కడ హడావిడి చేసి.. దుబయ్ లో తరుపరి కార్యక్రమాల కోసం ఫ్లైట్ ఎక్కబోతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి.. అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా కానీ ప్రతి అప్‌డేట్‌నీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటుంటారు ఆయన సతీమణి నమ్రత. అప్పుడప్పుడు మహేష్ కూడా తన పిల్లలకు సబంధించిన విషయాలు నెట్టింట్లో పంచుకుంటారు. ఇక ఈక్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సబంధించి క్రేజీ అప్ డేట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే అంతకంటే ముందు  ఓ కూల్ డ్రింక్ యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లారు మహేష్. అక్కడి నుంచి దుబయ్ వెళ్లబోతున్నారు. 

మంబయ్ లో ప్రముఖ ఫోటో గ్రఫర్ ఇంట్లో డిన్నర్ చేశారు మహేష్ అండ్ టీమ్. వారు నమ్రత ఫ్రెండ్  కావడంతో అక్కడ సందడి చేశారు. ఇందులో భాగంగా మహేష్, నమ్రతలతో పాటు SSMB 28 టీమ్.. యంగ్ మ్యూజిక్  డైరెక్టర్ థమన్, డైరెక్టర్ త్రివిక్రమ్, మరో దర్శకుడు మెహర్ రమేష్ అందరూ కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. 

అయితే ముంబయ్ నుంచి టీమ్ అంతా డైరెక్ట్ గా దుబయ్ వెళ్లబోతున్నారు. అక్కడ ఈసినిమాకు సబంధించిన మ్యూజిక్ సిట్టిగ్స్ ను ఏర్పటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ మ్యూజిక్ కు సబంధించిన క్లారిటీ వచ్చిన తరువాత మళ్ళీ ఇండియాకు రాబోతున్నారు టీమ్. వచ్చీ రాగానే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నారట SSMB28 టీమ్. 

ఈ పిక్స్ ను నమ్రత సోషల్ మీడియాలో శేర్ చేశారు. చిరునవ్వులు చిందిస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.. బెస్ట్ హోమ్ మేడ్ మీల్స్ పెట్టినందుకు తన స్నేహితురాలికి థ్యాంక్స్ చెప్పారు నమ్రత.. ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన మహేష్ – త్రివిక్రమ్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్మాత నాగ వంశీతో పాటు మహేష్, థమన్, త్రివిక్రమ్ అంతా దుబయ్ ప్లైట్ ఎక్కబోతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios