సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి భారీ సినిమాలు క్యూ కడుతుంటాయి. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు', అలానే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి.

పండగ మంగళవారం పడడంతో వీకెండ్ ని ఎవరూ మిస్ చేసుకోవాలని అనుకోవడం లేదు. దీంతో జనవరి 10 డేట్ ఇప్పుడు హాట్ గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అక్కడి మార్కెట్ ని కోల్పోవడానికి ఎవరూ అంగీకరించడం లేదు. 

దీంతో ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ లేదా ఒకరోజు గ్యాప్ ఉంటుందనిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు రజినీకాంత్ 'దర్బార్' కూడా అదే డేట్ న రావడానికి టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి పండగ వలన ఒక రోజు అటు, ఇటు అయినా లోకల్ మార్కెట్ లో వచ్చే తేడా ఏమీ ఉండదు కానీ ఓవర్సీస్ లో మాత్రం కనీసం మిలియన్ నుండి ఒకటిన్నర మిలియన్ తేడా అయినా పడుతుంది.

అంత డబ్బుని రిస్క్ చేయడానికి అటు మహేష్ టీం కానీ ఇటు అల్లు అర్జున్ టీం కానీ సిద్ధంగా లేకపోవడంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలకు తమ ప్రాజెక్ట్ ల మీద ఉన్న నమ్మకంతో ఇద్దరిలో ఎవరూ వెనుకడుగు వేయడానికి సిద్ధపడడం లేదు.