టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సౌత్ లో ఎంత క్రేజ్క్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నార్త్ లో కూడా ప్రిన్స్ కి మంచి ఫాలోయింగ్. నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్న మహేష్ ఎంత ఎత్తుకు ఎదిగిన సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు. 

ఈ ఫ్యామిలీ హీరోకి రోజు ఎదో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ తలుపుతడుతున్నప్పటికీ అస్సలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. స్పైడర్ తరువాత మహేష్ ఇతర భాషల్లో నటించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. తెలుగులోనే ఉన్న మార్కెట్ తో సంతృప్తి చెందుతూ ఇక్కడే హ్యాపీగా సినిమాలు చేసుకోవడం బెటర్ అని పలుమార్లు చెప్పిన మహేష్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే వివరణ ఇచ్చాడు.

బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే ఇక్కడే సినిమాలు చేసుకుంటే బెటర్ అంటూ తెలుగులో నటించడం నాకు చాలా సంతోషంగా ఉందని మంచి కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తే చాలని తెలియజేశాడు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా మహర్షి తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.