ఇండియాలో ఉన్న ఇద్దరు టాప్ మోస్ట్ స్టార్స్ మహేష్ బాబు, రణ్వీర్ సింగ్ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నారు. ప్రముఖ శీతలపానీయాల సంస్థ థమ్స్ అప్ ప్రచార చిత్ర షూటింగ్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ షూట్ కి సబంధించిన కొన్ని వీడియోలు మహేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ''ప్రప్రంచంలో చివరిగా మిగిలిన మగాళ్ళం మనమే అనుకుంటా'' అని రణ్వీర్ సింగ్ చెప్పగా.. మహేష్ '' ఇంకెవరైనా ఉంటే అక్కడే ఉంటారు'' అని థమ్స్ అప్ లోగో ఉన్న బిల్డింగ్ వైపు చూశారు. 

ప్రపంచ ప్రఖ్యాత శీతలపానీయాల సంస్థ కోకాకోలా అనుబంధ బ్రాండ్ థంప్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా మహేష్ , రణ్వీర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో రణ్వీర్, సౌత్ ఇండియాకు గాను మహేష్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. తొలిసారి రెండు రీజన్స్ ప్రచారకర్తలతో ఓ యాడ్ రూపొందిస్తున్నారు. ఈ యాడ్ షూట్ లో ఉత్కంఠరేపే ఛేజింగ్ సన్నివేశాలలో వీరిద్దరూ పాల్గొన్నట్లు ఉన్నారు. 

తొలిసారి కలిసి నటించిన ఈ ఇద్దరు నటులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. మరో వైపు జనవరి నుండి మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలలో మహేష్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి... థమన్ సంగీతం అందిస్తున్నారు.