సామాజిక కార్యక్రమాల కోసం మహేష్‌, రామ్‌చరణ్‌ కదిలారు. ఒకరు హెల్మెట్‌ పెట్టుకుంటే, మరొకరు గెస్ట్ గా వెళ్తున్నారు. సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ ధరించాలని చెబుతున్నారు మహేష్‌. ఈ మేరకు ఆయన హెల్మెట్‌ ధరించి బైక్‌పై ప్రయాణం చేస్తున్న ఫోటోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌లు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. `మీకు, మీ ఫ్యామిలీ సేఫిటీ కోసం హెల్మెట్‌ ధరించండి` అని పేర్కొన్నారు. 

మరోవైపు సైబరాబాద్‌ పోలీసుల కోసం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కదిలారు. `3వ ఆన్వల్‌ స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్ మీట్‌` ఈవెంట్‌ కోసం ఆయన గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. నేడు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు  గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. మరోవైపు గౌరవ అతిథిగా ఉపాసన కూడా పాల్గొననున్నారు. 

ప్రస్తుతం మహేష్‌ `సర్కారువారి పాట` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇటీవల దుబాయ్‌లో షూటింగ్‌ ప్రారంభమైంది. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.