రెండేళ్లుగా సరైన హిట్ లేకపోవడం.. ఎన్నో ఆశలు పెట్టుకున్న‘భరత్‌ అనే నేను’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రిన్స్ మహేష్ కు మాటలు రాలేదు. చెప్పేవి నాలుగుమాటలైనా తడబడ్డాయి. ఇటీవల కొంతకాలంగా అభిమానుల అంచనాలను రీచ్‌ కాలేకపోయానని, దీంతో టెన్షన్‌, ఒత్తిడి పెరిగిందన్నాడు. ఫిల్మ్ హిట్ కావడంతో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానని, ఎలా రియాక్ట్‌ కావాలో కూడా తెలియట్లేదని అన్నాడు.  ఇంతకంటే పెద్ద స్టోరీ రాయడానికి ట్రై చేస్తున్నానని, పూర్తికాగానే మహేష్ ఇంటికెళ్లి అంతా రెడీ అని చెప్పేస్తానని అన్నాడు డైరెక్టర్. 

కొరటాల డైరెక్షన్లో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాకు  ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్‌ఖుషీగా వుంది. సోమవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో మూవీలో కీలక సభ్యులు, నిర్మాత దానయ్య మనసులోని మాట బయటపెట్టారు. ఎవరెవరు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే..