టాలీవుడ్ లో ఈ ఏడాది మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో అత్యధిక వేగంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 

రీసెంట్ గా సుదర్శన్ 35MM లో అభిమానులను కలుసుకొని విజయాన్ని పంచుకున్న సూపర్ స్టార్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్నారు. విజయవాడలో  అభిమానులను కలుసుకునేందుకు వేదికను కూడా ఫిక్స్ చేశారు. సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ను ఫిక్స్ చేశారు. 

మహేష్ బాబుతో పాటు మహర్షి చిత్ర యూనిట్ లో నటించిన యాక్టర్స్ అందరూ వేడుకలో పాల్గొననున్నారు. వెయ్యి మందికి పైగా అభిమానులు ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.