సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు  హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా గురువారం విడుదలై మార్నింగ్ షో కే మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో సూపర్  కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ ఉత్సాహం మహేష్ లోనూ, ఆయన కుటుంబంలోనూ కనపడుతోంది. వారంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మహర్షి సినిమాని మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి స్పెషల్ షో నిన్న చూసారు.

రిషి పాత్ర తనను బాగా ఎక్సైట్ చేసిందని కృష్ణ అన్నారు. ముఖ్యంగా మూడు పాత్రల్లో మహేష్ వేరియేషన్స్ చూపించిన తీరు ఆయనకు బాగా నచ్చిందిట. సీనియర్ నరేష్ సైతం ఈ సినిమాని స్పెషల్ స్క్రీనింగ్ లో చూసారు. తాను రెండో సారి ఈ సినిమా చూస్తున్నానని, మహేష్ రైతుగా మెస్మరైజ్ చేసారని అన్నారు.

కలెక్షన్స్ పరంగా చూస్తే...గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నైజాంలో రికార్డు స్థాయిలో ఓపెనింగ్‌ వసూళ్లను రాబట్టింది. తొలిరోజు రూ.6.38 కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికాలో తొలి రోజు 6,66,000 డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు పేర్కొన్నారు.