టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ మూవీ  మహర్షి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజె చేశారు. మహేష్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ 500 లొకేషన్స్ లో సినిమా రిలీజ్ అయ్యింది. ఇక యుఎస్ లో కూడా సినిమా ప్రీమియర్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమాలో మహేష్ డిఫరెంట్ షేడ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే టాక్ వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త తరహా సినిమాతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడని చెప్పవచ్చు. "సక్సెస్ ఈజ్ ఏ జర్నీ" అంటూ మహేష్ రిషి పాత్రలో కనిపించిన విధానం ఎదో తెలియని ఆలోచనని కలిగించింది.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగితే సెకండ్ హాఫ్ ఏమోషనల్ గా సాగింది. సినిమాలో  అల్లరి నరేష్ పాత్ర చాలా కీలకమైంది. అతన్ని రవి అనే పాత్రకు తీసుకోవడంలో దర్శకుడి సరికొత్త ఆలోచనా విధానం కనిపించింది. విదేశాలకు వెళ్లిన యువకుడు తిరిగి సొంత దేశం వైపు చేసిన ప్రయాణంలో ఎలాంటి ఆలోచనలో ముందుకు వెళ్లాడనేది సినిమాలో అసలు పాయింట్.

చివరలో ఏమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. పూజా హెగ్డే నటన కూడా బావుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. మొత్తంగా సినిమా మాస్ ఆడియెన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అందరిని మెప్పించేలా ఉందని టాక్.