సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. మరోపక్క సినిమా ఫైనల్ కాపీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

టైటిల్స్ మొత్తం కలుపుకొని సినిమా నిడివి 170 నిమిషాలు వరకు వచ్చినట్లు సమాచారం. అంటే దాదాపు మూడు గంటలకు దగ్గరగా అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమా ఫుటేజ్ మొత్తం నాలుగు గంటల వరకు వచ్చిందట. దాన్ని కుదించి మూడు గంటలలోపు తీసుకొచ్చారు.

ఫైనల్ కాపీ చూసుకున్న తరువాత నిర్మాతలు హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి నాలుగు పాటలను విడుదల చేశారు. మిగిలిన పాటలను కూడా విడుదల చేసి ట్రైలర్ ని ప్రీరిలీజ్ ఫంక్షన్ రోజు మే 1న విడుదల చేయనున్నారు.

మే 2 నుండి అన్ని థియేటర్లలో ట్రైలర్ ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నారు.