మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో హైలైట్స్అంటూ కొన్ని పాయింట్లు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.
రిజిస్టార్ ఆఫీస్ లు రైతుల భూముల సీన్ ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అలానే సాయి కుమార్, మహేష్ బాబుల మధ్య వచ్చే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. విలన్ తో హీరో సవాల్ చేయడం మహేష్ ఫ్యాన్స్ ని ఈలలువేసేలా చేస్తుందని చెబుతున్నారు.
సినిమా మొత్తానికి ప్రీక్లైమాక్స్ లో వచ్చే ప్రెస్ మీట్ హైలైట్ గా ఉంటుందట. ఈ సీన్ కి అందరూ చప్పట్లు కొట్టడం ఖాయమంటున్నారు. క్లైమాక్స్ లో హీరో వెంట వేలమంది రైతులు వచ్చే సీన్, ఆ సమయంలో వచ్చే పాట మరో స్థాయిలో ఉంటుందట.
మంచి సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీశారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన నిర్మాతలు సంతృప్తిని వ్యక్తం చేశారట. సినిమాటోగ్రఫీ, డిఐ క్వాలిటీ ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు.
