సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ క్రమంలో ఓ పోస్టర్ ని విడుదల చేసింది. మహేష్ నటించిన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' సినిమాల తరువాత రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.

రైతులు, వ్యవసాయం నేపధ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు.