సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సమ్మర్ లో రాబోతున్న పెద్ద సినిమా కావడంతో బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగి ఉంటుందని, నిర్మాత దిల్ రాజు ఎక్కువ మొత్తాలకి సినిమా అమ్మి ఉంటారని అంతా అనుకున్నారు.

కానీ దిల్ రాజు రెగ్యులర్ రేట్లకే సినిమాను అమ్మినట్లు తెలుస్తోంది. 'భరత్ అనే నేను' సినిమా మార్కెట్ చేసిన రేటుకే ఈ సినిమాను కూడా ఇచ్చేశారట. ఆంధ్రలో రూ.38 కోట్ల రేషియోలో, సీడెడ్ లో రూ.12 కోట్లకు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. నైజాం, అలాగే ఆంధ్రలోని వైజాగ్ ఏరియాలకు రేట్లు కట్టి నిర్మాత దిల్ రాజు ఉంచుకున్నారు.

అయితే నైజాంకు ఎంత రేటు కట్టారనే విషయం బయటకి రాలేదు. 'భరత్ అనే నేను' సినిమా నైజాం హక్కులు రూ.22 కోట్లకు ఇస్తే.. కలెక్షన్లు మాత్రం రూ.19 కోట్లలోపే ఆగిపోయాయి. ఆ కారణంగానే ఇప్పుడు 'మహర్షి' పదిహేడు లేదా పద్దెనిమిది కోట్లలో డీల్ అనుకుంటున్నట్లు సమాచారం.

ఓవర్సీస్ లో మాత్రం మహేష్ కి మార్కెట్ ఉండడంతో అక్కడ ఎక్కువ రేట్లు చెబుతున్నట్లు టాక్. నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ ఒకరి పేరు చెబుతుంటే.. దిల్ రాజు మాత్రం మరొకరికి రైట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరేం జరుగుతుందో చూడాలి!