మహర్షి సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర కీలకమని అందరికి తెలిసిందే.
మహర్షి సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర కీలకమని అందరికి తెలిసిందే. ఇక హీరోయిన్ పూజ క్యారెక్టర్ కూడా అందరిని ఆకట్టుకుంటుందని టాక్.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ సీన్స్ తో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగుతుందని సమాచారం. మహేష్ - నరేష్ ల మధ్య వచ్చే సీన్స్ అందరిని ఆకట్టుకుంటాయట. వెన్నల కిషోర్ కూడా తన టైమింగ్ తో అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. మహేష్ యంగ్ కాలేజ్ స్టూడెంట్ గా అభిమానుల చేత విజిల్స్ వేయించడం పక్కా. ఇక అల్లరి నరేష్ పాత్రలో కామెడీ అనే కాకుండా చాలా సీరియస్ గా కూడా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
మూడు విభిన్న పాత్రల్లో కనిపించే మహేష్ మహర్షికి అసలైన అర్ధాన్ని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని డైలాగ్స్ కూడా గుండెను తాకుతాయట. మొత్తంగా ఫస్ట్ హాఫ్ తో నవ్వించి సెకండ్ హాఫ్ లో యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ తో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. అమెరికాలో కూడా మహర్షి సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలకు సంబందించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
