సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షోలు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అక్కడ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్, పైగా ఆయన నటిస్తోన్న 25వ సినిమా కావడంతో హైప్ బాగా వచ్చింది.

గతంలో బాహుబలి 2, భరత్ అనే నేను సినిమాలను ఓవర్సీస్ లో రిలీజ్ చేసిన గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ సమస్త ఈ సినిమాను కూడా ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది. దాదాపు రూ.14 కోట్లకు ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నారు. అమెరికా మొత్తంగా ఈ సినిమా కోసం 260 స్క్రీన్స్ బుక్ చేశారు.

దాదాపు 2500 ప్రీమియర్ షోలను అమెరికాలో వివిధ లొకేషన్లలో ప్రదర్శించారు. ఒక్కో టికెట్ ను 15 నుండి 20 డాలర్లకు విక్రయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్ల విషయానికొచ్చేసరికి 202 లోకేషన్స్ లో ఈ సినిమా 455,060 డాలర్లను వసూలు చేసింది.

అన్ని లోకేషన్స్ లో కలిపితే మంచి నంబర్స్ చూపించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 'భరత్ అనే నేను' సినిమా ఓవర్సీస్ రికార్డ్స్ ని ఈ సినిమా బీట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.