సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మహర్షి మరో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. కెరీర్ లో 25వ చిత్రం కావడంతో తెలుగు ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో 50 రోజులను పూర్తి చేసుకుంది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి 103కోట్లకు పైగా షేర్స్ అందించింది. 

ఇక 200 స్క్రీన్స్ లలో విజయవంతంగా సినిమా మరో మూడు రోజుల్లో ఆఫ్ సెంచరీ కొట్టనుంది. చాలా రోజుల తరువాత ఒక సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోనుంది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఈ రోజుల్లో 25 రోజులకే థియేటర్స్ లో కనిపించకుండా పోతున్నాయి. అయితే సూపర్ స్టార్ సినిమా మాత్రం పాత రికార్డుల్ని మళ్ళీ గుర్తు చేసింది. 

దీంతో చిత్ర యూనిట్ 50 డేస్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తోంది. జూన్ 28కి శిల్పా కళా వేదికలో వేలాది మంది అభిమానుల నడుమ ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. వేడుకకు ఇతర సినీ ప్రముఖులు కూడా ముఖ్య అతిథులుగా రానున్నారు.