ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం 'ది స్కై ఈజ్ పింక్'. ఫరాన్ అక్తర్, ప్రియాంక కలసి నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దంగల్ ఫేమ్ జైరా వసీం ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఓ వింత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. 15 ఏళ్లకే రచయిత, వక్తగా అయిషా చౌదరి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా ది స్కై ఈజ్ పింక్ ట్రైలర్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ ట్రైలర్ లో ఓ సన్నివేశం మహారాష్ట్ర పోలీసులని ఆకర్షించింది. ప్రియాంక, ఫరాన్ తమ కుమార్తె అనారోగ్యం గురించి మాట్లాడుకునే సన్నివేశం అది. 

వీలైనంత త్వరగా ఏదైనా బ్యాంక్ లో దోపిడీ చేయాలి. లేకుంటే మన పాపకు వైద్యం చేయించడం కష్టం అని మాట్లాడుకుంటారు. ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు సోషల్ మీడియాలో స్పందించారు. ఆ నేరానికి పాల్పడితే సెక్షన్ 393 కింద ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుందని సరదాగా వార్నింగ్ ఇచ్చారు. 

దీనికి ప్రియాంక కూడా సరదాగానే స్పందించింది. అరెరె మనం ప్లాన్ తెలిసిపోయింది.. ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయాలి అని ట్వీట్ చేసింది. ఆసక్తి పెంచుతున్న ది స్కై ఈజ్ పింక్ ట్రైలర్ ని ఈ కింద చూడవచ్చు.