ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను వదలి మొత్తానికి అభిమానులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.. కానీ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఇంకా సందేహంగానే ఉంది. కథానాయకుడు ఇచ్చిన రిజల్ట్ కి అసలు చిత్ర యూనిట్ మొత్తం సైలెంట్ అయిపొయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందు నెల రోజులకు ముందే సినిమా ప్రమోషన్స్ తో హంగామా చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు మాత్రం అంతగా బజ్ క్రియేట్ చేయడం లేదు. 

ఫిబ్రవరిబీ 22న మహానాయకుడు సినిమా రిలిజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా అలోచించి ఒక ట్రైలర్ ని అయితే రెడీ చేసుకున్నారు. మొదట మహానాయకుడు కథానాయకుడు ట్రైలర్ ఒకటే అని చెప్పిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో ట్రైలర్ ను కట్ చేసింది. సెకండ్ పార్ట్ లోనే అసలైన కంటెంట్ ఉండడంతో ఓ వర్గం వారికి సినిమాపై అమితమైన ఆసక్తి ఉంది. కానీ బాలకృష్ణ వెన్ను పోటును చూపించగలడా? వైస్రాయ్ ఘటనను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనే దానిలో అనుమానాలు గట్టిగానే ఉన్నాయి. 

రేపు సాయత్రం కరెక్ట్ గా 5గంటల 55 నిముషాలకు విడుదల చేయబోయే ట్రైలర్ తోనే సినిమా కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఒక్క కాంట్రవర్సీకి టచ్ చేసినా సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ అందుతాయని చెప్పవచ్చు. దర్శకుడు క్రిష్ అసలు కథకు ఎలా ముగింపు పలుకుతాడు అనేది సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తోంది. సినిమా భవిష్యత్తు ఏమిటో కాలంతో పాటు ట్రైలర్ కూడా నిర్ణయించే అవకాశం ఉంది.. సో.. చిత్ర యూనిట్ అలాగే బయ్యర్స్ టెన్షన్ లో ఉన్నారనే చెప్పాలి. చూద్దాం.. ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో..