సావిత్రి జీవిత కథ  ఆధారంగా మహానటి లీడ్ రోల్ చేస్తున్న కీర్తి సురేష్ పాలకొల్లులో చిత్ర బృందం

లెజెండరీ నటి ‘సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ మహానటి’. ఈ సినిమాలో సావత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పాలకొల్లులో నిర్వహిస్తున్నారట.

ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించగా ఇప్పుడు తాజాగా పాలకొల్లులో షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. గోదావరి తీరాన అంతర్వేదిలో కూడా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వైజయంతీ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవర కొండ, షాలిని, ప్రగ్యా జైశ్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.