నటీనటులు.. కీర్తిసురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవర కొండ, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్ 

సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్-లోపేజ్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాతలు: అశ్వనీదత్, స్వప్నా దత్మ ప్రియాంక దత్

దర్శకత్వం: నాగ్ అశ్విన్ 

విడుదల తేదీ: మే 9 శుక్రవారం 

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. నేటి తరం వారికి కూడా సావిత్రి గురించి చెప్పే ప్రయత్నం చేస్తోన్న నాగ్ అశ్విన్ ఎంతవరకు సక్సెస్ అయ్యారో తేలాల్సివుంది.  సినిమాని చూస్తున్న కొందరు అభిమానులు ట్విట్టర్ 
ద్వారా.. తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారి ట్వీట్ల ప్రకారం.. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

మనసుకు హద్దుకునే సన్నివేశాలతో చాలా రోజుల తరువాత ఓ క్లాసికల్ మూవీ చూశామన్న అనుభూతి ప్రేక్షకులకు కలగడం ఖాయమే అంటున్నారు. నాగ అశ్విన్ ప్రతిభకు అద్దం పట్టేలా ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉందని.. ఎవర్ గ్రీన్ అందాల నటి బయోపిక్ మూవీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌ హిట్‌గా నిలిచిపోతుందని ప్రశంసిస్తున్నారు.

సావిత్రి బాల్యం, ఆమె నిజ జీవిత సంఘటనలు.. ఆమె ఎదుగుదల.. వైవాహిక జీవితం.. ఆమె మరణం.. ఇలా సావిత్రి జీవితంలోని కీలక ఘట్టాలను బలమైన పాత్రలతో ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు. ముఖ్యంగా మహానటి సావిత్రిగా లీడ్ రోల్‌లో నటించిన కీర్తి సురేష్ నటనకు ముగ్ధులవ్వడం ఖాయమే అంటున్నారు. అలనాటి అందాల నటి మళ్లీ పుట్టిందా అనే విధంగా కీర్తి కొన్ని సీన్లలో జీవించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసిందట. 

ఫస్టాఫ్‌లో సావిత్రి జీవితానికి సంబంధించిన కీలక ఘట్టాలను నాటి పరిస్థితుల్ని గుర్తు చూస్తూ అద్భుతంగా తెరకెక్కించారని.. సెకండాఫ్‌లో సమంత, విజయ్ దేవరకొండ సీన్స్ బాగా పండాయంటున్నారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని.. మిక్కీజే మేయర్ అందించిన పాటలు సినిమాకు మరింత బాలాన్ని ఇవ్వగా.. 1940, 50 నాటి పరిస్థితులకు అనుగణంగా అందించిన నేపథ్యం సంగీతం సూపర్‌గా ఉందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ‘తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వి౦చే 'మహానటి' సావిత్రి కథ’ అంటూ ట్విట్టర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా పూర్తి రివ్యూ తెలియాలంటే.. మరికొంత సేపు ఎదురుచూడాల్సిందే.