స్టార్ హీరోల కోవలోనే 'మహానటి' కూడా!

mahanati movie run time 2 hours 56 minutes
Highlights

ఒకప్పుడు తెలుగులో మూడు గంటల సినిమాలు వచ్చేవి. కానీ రాను రాను నిడివి తగ్గించి రెండున్నరకు తెచ్చారు

ఒకప్పుడు తెలుగులో మూడు గంటల సినిమాలు వచ్చేవి. కానీ రాను రాను నిడివి తగ్గించి రెండున్నరకు తెచ్చారు. దానికంటే తక్కువ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువ నిడివితో విడుదలవుతున్నాయి. 'అర్జున్ రెడ్డి' సినిమా నుండి రీసెంట్ గా విడుదలైన నా పేరు సూర్య సినిమా వరకు సినిమాలన్నీ కూడా రెండున్నర గంటలకు పైన నిడివి ఉన్నవే.. రంగస్థలం సినిమా రెండు గంటల 45 నిమిషాల నిడివితో విడుదల చేశారు. కంటెంట్ లో సత్తా ఉండడంతో సినిమా మంచి విజయాన్ని  అందుకుంది.

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' డ్యూరేషన్ 2 గంటల 53 నిమిషాలు. నా పేరు సూర్య సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు. ఇప్పుడు ఇదే కోవలో 'మహానటి' సినిమా కూడా విడుదలవుతుంది. కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల 56 నిమిషాలు. నిజానికి దర్శకుడు రాసుకున్న కథ ప్రకారం 5 గంటల సినిమా వచ్చిందట. కానీ స్క్రిప్ట్ దశలోనే దాన్ని కుదించి మూడు గంటల వరకు చేశాడు. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటే నిడివితో ఎలాంటి సమస్య ఉండదు. మరి నాగ్ అశ్విన్  సినిమాను ఎలా రూపొందించాడో మరికొద్ది గంటల్లోనే తెలిసిపోతుంది!

 

loader