'మహానటి' మూవీ ప్రివ్యూ..

'మహానటి' మూవీ ప్రివ్యూ..

చిత్రం: మహానటి 

నటీనటులు: కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు 

సంగీతం: మిక్కీ జె మేయర్ 

సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్-లోపేజ్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు 

నిర్మాతలు: అశ్వనీదత్, స్వప్నా దత్మ ప్రియాంక దత్

దర్శకత్వం: నాగ్ అశ్విన్ 

విడుదల తేదీ: మే 9 శుక్రవారం 

 

అలనాటి కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. నేటి తరం వారికి కూడా సావిత్రి గురించి చెప్పే ప్రయత్నం చేస్తోన్న నాగ్ అశ్విన్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడో తేలాల్సివుంది. 

సావిత్రి జీవితచరిత్ర అనగానే ప్రతి ఒక్కరికీ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అసలు దర్శకుడు ఆమె జీవితంలో ఎలాంటి ఎలిమెంట్స్ టచ్ చేశాడు..? పూర్తిగా పాజిటివ్ గా చెప్పదలచుకున్నాడా..? లేక ఆమె జీవితంలో చీకటి కోణాన్ని కూడా చూపించబోతున్నాడా..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆతురతగా ఎదురుచూస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర్కెక్కించారు. ఇప్పటికే మిక్కీ జె మేయర్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు సెన్సార్ సభ్యుల నుండి కూడా పాజిటివ్ స్పందన రావడంతో పాటు క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page