ఆరో స్థానంలో 'మహానటి'!

mahanati movie overseas collections
Highlights

టాలీవుడ్ మొత్తం మహానటి ఫీవర్ తో ఊగిపోతుంది. సాధారణ ప్రేక్షకుడి నుండి సిఎం వరకు 

టాలీవుడ్ మొత్తం మహానటి ఫీవర్ తో ఊగిపోతుంది. సాధారణ ప్రేక్షకుడి నుండి సిఎం వరకు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. బుధవారం తెలుగులో విడుదలైన ఈ చిత్రాన్ని శుక్రవారం తమిళంలో విడుదల చేశారు. అక్కడ ప్రజలు ఎంతగానో ప్రేమించే జెమినీ గనేషన్ పాత్రను నెగెటివ్ గా చూపించడంతో వ్యతిరేకత ఏమైనా వస్తుందనుకున్నారు. కానీ వారు సినిమాను సినిమాగానే చూసి ఆదరిస్తున్నారు. ఇక అమెరికాలో ఈ సినిమాకు మరో ఘనత దక్కింది.

శుక్రవారం నాటికి ఈ సినిమా 5 కోట్ల 75 లక్షలను రాబట్టింది. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ కు అతి చేరువలో ఉన్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో 'రంగస్థలం','భరత్ అనే నేను','అజ్ఞాతవాసి','భాగమతి','తొలిప్రేమ' వంటి  సినిమా తరువాత స్థానాన్ని దక్కించుకుంది.

ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది మహానటి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత వంటి తారలు నటించారు. 

loader