సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలయ్యి మూడు వారాలు దాటుతున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
అయితే ఈ సినిమా నిడివి ఎక్కువ ఉండడంతో కొన్ని సన్నివేశాలను కట్ చేశారు. ఇప్పుడు అలా డిలీట్ చేసిన సన్నివేశాలను చిత్రబృందం ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో విడుదల చేస్తోంది. తాజాగా 'రావోయి మా ఇంటికి' పాటకు విడుదల చేశారు. ఆ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

