కెరీర్ ఇంకా ప్రారంభం కానీ రోజుల్లో ఒప్పుకున్న సినిమాలు..ఆ తర్వాత రోజుల్లో తలకు చుట్టుకుంటాయి. ఇప్పుడు కీర్తి సురేష్ అదే పరిస్దితిని ఎదుర్కొంటోందని సమాచారం. ఆమె కొద్ది సంవత్సరాల క్రితం సీనియర్ నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. భారీ ఎత్తున లాంచింగ్ జరిగింది. మహేష్ బాబు సైతం ఈ లాంచ్ కు హాజరయ్యారు.

'ఐనా ఇష్టం నువ్వు' టైటిల్ తో  కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ రఘుతు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మాణంలో ఈ సినిమా మొదలెట్టారు.షూటింగ్ ఓ థర్టి పర్శంట్ పూర్తి అయ్యి ,రకరకాల కారణాలతో ఆగిపోయింది. 

ఆ సినిమా కమిటయ్యే నాటికి  కీర్తి సురేష్ ఎవరో జనాలకి తెలియదు. కేవలం మళయాళం నుంచి ఇక్కడకు వచ్చిన ఓ కొత్త అమ్మాయి అంతే.  అయితే ఇప్పుడు పరిస్దితి మారింది. ఆమె మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలే ఎదురుచూస్తున్నారు. ఈ సిట్యువేషన్ లో ఆమె అప్పట్లో మొదలై ఆగిపోయిన సినిమా పూర్తి చేయాలా అనేది పెద్ద క్వచ్చిన్. నిర్మాతలు ఈ సినిమా పూర్తి చేసి కీర్తి సురేష్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

దాంతో షూటింగ్ మొదలెట్టి పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. కానీ కీర్తి సురేష్ ఒప్పుకోవటం లేదు. తాను అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం  వెనక్కి పంపేస్తానని అంది. అయితే నిర్మాతలు ..సినిమా పూర్తి చెయ్యాలి అంటున్నట్లు సమాచారం. కానీ లెక్క ప్రకారం అప్పట్లో తాను ఇచ్చిన డేట్స్ ని వినియోగించుకోలేదు అని, అయినా సరే తను తీసుకున్న మొత్తం వెనక్కి ఇస్తానంటున్నాను కాబట్టి ఆ ప్రాజెక్టు చేసే ప్రసక్తి లేదని క్లియర్ గా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కీర్తి సురేష్  ఇప్పుడు రాజమౌళి పిలుపు కోసం ఎదురుచూస్తోంది.