Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల అదుపులో నటి మహాలక్ష్మి భర్త రవీందర్ చంద్రశేఖర్, ఆర్ధికనేరంలో విచారణకు నిర్మాత.

మోసపూరిత ఆర్ధిక కార్యక్రమాలకు పాల్పడ్డ కేసులో.. ప్రముఖ నిర్మాత.. నటి మహాలక్ష్మి భర్త  రవిందర్ చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..?
 

Mahalakshmi Husband And Producer Ravindar Chandrasekaran Have Been Arrested JMS
Author
First Published Sep 8, 2023, 2:07 PM IST

మోసపూరిత ఆర్ధిక కార్యక్రమాలకు పాల్పడ్డ కేసులో.. ప్రముఖ నిర్మాత.. నటి మహాలక్ష్మి భర్త  రవిందర్ చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..?
 
తమిళ సినీ నిర్మాత రవీందర్‌ చంద్రశేఖర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆర్ధిక నేరాల కేసులో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్‌ అవుతుంటాడు రవిందర్. ఈమధ్యే ఆయన పెళ్లి విషయంలో ఇంకా ఫేమస్అయ్యాడు. పోయిన ఏడాది  నటి మహాలక్ష్మి శంకర్‌  ను ప్రేమించి  మరీ పెళ్ళాడాడు రవీందర్ చంద్రశేఖర్.  మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడంతోనే.. ఇంకా ఫేమస్ అయ్యాడు నిర్మాత. అప్పట్నుంచే ఆయన తరచూ వార్తల్లో వ్యక్తి అవుతున్నాడు. 

తాజాగా ఈ నిర్మాత  చిక్కుల్లో పడ్డాడు.  చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ రవీందర్‌ను అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారవేత్తను  మోసం చేయడం.. ఆర్ధిక నేరాలకు పాల్పడిన కేసులో.. చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  ఘన వ్యర్థాల ఉంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను పెట్టి బోల్డన్నీ లాభాలు గడించవచ్చని రవీందర్‌ చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని నమ్మించాడట.ఇందుకు కావాల్సిన  నకిలీ పత్రాలను సృష్టించి. బాలాజీని ఈ ప్రాజెక్టులో భాగస్వామిని చేశాడు. ఇందుకోసం ఆయన దగ్గర నుంచి 15.83 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి.  అంతే కాదు  వీరిద్దరి మధ్య 2020, సెప్టెంబర్‌17 ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. 

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఒప్పందంలో ఉన్న విధంగా జరక్కపోవడం.. రవీందర్‌ చెప్పినవి ఏవీ చేయకపోవడంతో.. డబ్బు తిరిగి ఇచ్చేయమని బాలాజీ ఎన్నిసార్లు అడిగినా రవీందర్‌ నుంచి సరైన జవాబు రావడం లేదు. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నాడు బాలాజీ. రవీందర్‌ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్ధిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌లో కంప్లయింట్‌ చేశారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. 

లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తమిళంలో రవీందర్‌ చాలా సినిమాలు తీశాడు. తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. రవీందర్‌ చంద్రశేఖర్‌ ఇదివరకే చాలా వివాదాలలో చిక్కుకుని ఉన్నాడు. గతంలో విజయ్‌ అనే తన ఫ్రెండ్‌ దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు తీసుకుని, ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేస్తానని నమ్మించి మోసం చేశాడు. ఆ కేసు కూడా రవీంరద్‌పై ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios