‘మహాసముద్రం’ లో అదిరిపోయే ట్విస్ట్, ఆ క్యారక్టర్ పైనే,మూమాలుగా ఉండదట

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Maha Samudram To Have Crazy Twist In Aditi rao s Character

మొదటి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్ద హీరోలుగా ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

https://www.youtube.com/watch?v=khbpC9joyoY

ట్రైలర్ చూస్తే శర్వానంద్, సిద్దార్ద, రావు రమేష్, జగపతి బాబు, అదితిరావు హైదరి ఇలా అన్ని పాతలను మంచి డెప్త్ తో తయారుచేసినట్లు అర్దం అవుతోంది. అలాగే హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్,   ట్రయిలర్ లో బాగా పండాయి. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ సినిమా అనిపిస్తోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆర్ఎక్స్ 100’ టైప్ లోనే ఓ అదిరిపోయే సూపర్ ట్విస్ట్ సినిమాలో ఉందిట. అది అదితిరావు హైదరి పాత్ర లో ఆ ట్విస్ట్ ఉండబోతోందిట. సరైన టైమ్ లో పడే ఆ ట్విస్ట్ చూసేవాళ్ల మైండ్ బ్లాక్ అవుతుందని, ఆ ట్విస్ట్ వర్కవుట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. అలాగే ఈ సినిమాలో డైలాగులు కూడా ఓ రేంజిలో ఉండబోతున్నాయట. 'ఇక్కడ మనకు నచ్చినట్లు బతకాలంటే మన జాతకాలను దేవుడు మందు కొట్టి రాసుండాలి' ...'నవ్వుతూ వున్నంత మాత్రాన ఆనందంగా వున్నట్లు కాదు..'...వంటి ట్రైలర్ లో ఉన్న డైలాగులే కాకుండా సినిమాలోనూ అదిరిపోయే డైలాగులు ఉన్నాయట.

  ఇక దసరా కానుకగా సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.   మహాసముద్రం మీద ఎక్సపెక్టేషన్స్ ఏర్పడేలా చేసింది ట్రయిలర్. ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యయేల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. రావు రమేష్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios