Asianet News TeluguAsianet News Telugu

‘మాస్ట్రో’ :ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్‌ తాజాగా నటిస్తున్న చిత్రం మాస్ట్రో. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కాబోతుందని నితిన్‌ వెల్లడించాడు.  

Maestro to stream from 17th September
Author
Hyderabad, First Published Aug 27, 2021, 8:50 AM IST

హీరో నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం నితిన్‌ కు 30వ సినిమా. ఈ చిత్రం లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టంబర్‌లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర టీమ్ ట్రైలర్‌ని విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగిని ఈ ట్రైలర్‌ ఆసక్తిగా ఉండి, మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. ఈ నేఫధ్యంలో సినీ లవర్స్ ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక మొన్న విడుదలైన మాస్ట్రో ట్రైలర్ లో సెప్టెంబర్ 9 ప్రీమియర్స్ అంటూ అనౌన్స్ చేశారు. కానీ కాసేపటికే ఆ ట్రైలర్ డిలీట్ అయ్యింది. పది నిమిషాల గ్యాప్ లోఇంకో ట్రైలర్ విడుదలైంది. అందులో కమింగ్ సూన్ అని మాత్రమే వేశారు. డేట్ మెన్షన్ చేయలేదు.  దానికి కారణం సెప్టెంబర్ 10 న నాని టక్ జగదీష్ ఓటిటి లో విడుదలవుతుందని వార్తలు రావడం, నాగ్ చైతన్య-సాయిపల్లవి తాజా చిత్రం లవ్ స్టోరీ విడుదల వుండడంతో ఆ డేట్ వద్దనుకున్నారని, అనవసరంగా పోటీలో దిగటం ఎందుకని విరమించుకున్నారని తెలిసిందే.అయితే సెప్టెంబర్ 17న కొత్త డేట్ గా ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రైట్స్ కోసం  హాట్ స్టార్ డిస్నీ  వారు దాదాపు 32 కోట్ల ఆఫర్ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అంధాదున్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందింది.మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లగా మాస్ట్రో తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండా ఆయనకు జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎప్పుడో విడుద‌ల కావ‌లసి ఉండగా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వచ్చింది. ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios