ధనుష్ మా కొడుకే అంటూ తమిళనాడుకి చెందిన వృద్ధ దంపతులు కోర్ట్ మెట్లెక్కారు. గత కొన్ని ఏళ్లుగా ఈ కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్ట్ హీరో ధనుష్‌కి సమన్లు జారీ చేసింది.
హీరో ధనుష్(Dhanush) విచిత్రమైన కేసుని ఎదుర్కొంటున్నాడు. ఆయన తల్లిదండ్రుల విషయంలో అయోమయం నెలకొంది. ధనుష్ మా కొడుకే అంటూ తమిళనాడుకి చెందిన వృద్ధ దంపతులు కోర్ట్ మెట్లెక్కారు. గత కొన్ని ఏళ్లుగా ఈ కేసు నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్ట్ హీరో ధనుష్‌కి సమన్లు జారీ చేసింది. కతిరేసన్, ఆయన భార్య మీనాక్షిలు ధనుష్ మా కొడుకే అంటూ ఆరోపిస్తున్నారు. గత ఆరేళ్ల క్రితం వీరు మదురై జిల్లాలోని మేలూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.తమ బాగోగులు చూసేందుకు నెలకు రూ.65000 ఇవ్వాలని కోరారు. ఈ కేసు ఏళ్ల తరబడి నడుస్తుంది. ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.
అయితే ధనుష్ తమ మూడో కుమారుడని కతిరేసన్, ఆయన భార్య మీనాక్షి ఆరోపిస్తున్నారు. సినిమాల్లో రాణించేందుకు ఇంటి నుంచి పారిపోయారని అంటున్నారు. తామే అసలైన తల్లిదండ్రులమని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు బర్త్ సర్టిఫికేట్, టెన్త్ మెబో వంటివి చూపిస్తున్నారు. ఈ కేసులో ధనుష్‌కి పితృత్వ పరీక్షలు చేయాలని డిమాండ్ చేయగా, చివరికి కోర్ట్ ఆదేశాల మేరకు ఇప్పటికే పితృత్వ పరీక్షలు చేయగా, అందులో నిజం లేదని వెల్లడైంది. ఈ కేసుని కొట్టివేస్తూ 2020లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ తాజాగా వృద్ధ దంపతులు మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించారు.
కాగా పితృత్వ పత్రాలు నకిలీవని రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అప్పట్లో కోర్టు పేర్కొంది. తాజాగా ఈ కేసులో మద్రాస్ హైకోర్ట్ ధనుష్‌కి కోర్ట్ సమన్లు పంపడం దుమారం రేపుతుంది. ఇప్పటి వరకు ధనుష్ సమర్పించిన ఆధారలకు సంబంధించి పోలీసు విచారణ చరిపించాలని కోర్ట్ వెల్లడించింది. ధనుష్ ఈ కేసులో తాను తమిళ దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా, భార్య విజయలక్ష్మిల కుమారుడనని తెలిపారు. ఈ సందర్భంగా డీఎన్‌ఏ టెస్ట్ చేయాలని కతిరేసన్, ఆయన భార్య కోరగా దాన్ని ధనుష్ తిరస్కరించారు. దీంతో కోర్ట్ దీనిపై ఆదేశాలు జారీ చేయగా, పరీక్షల ఫలితాలు అసంపూర్తిగా నిరూపించబడ్డాయి. ఇప్పుడు ఈ కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది.
ఇటీవల `మారన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చారు ధనుష్. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరాజయం చెందింది. ప్రస్తుతం ఆయన `ది గ్రే మ్యాన్` అనే ఇంటర్నేషన్ మూవీతోపాటు తెలుగు తమిళంలో `సర్` అనే చిత్రంలో, `నానే వరువేన్`, `తిరుచిత్రంబలం` సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ధనుష్ తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ నుంచి విడిపోయారు. 18ఏళ్ల జర్నీ అనంతరం వీరు విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఐశ్వర్య .. రజనీకాంత్ కూతురు అనే విషయంతెలిసిందే.
