Asianet News TeluguAsianet News Telugu

మద్రాస్ కోర్టు తీర్పు, రామ్ చరణ్ హ్యాపీ

 ఇది రామ్ చరణ్ కు,దిల్ రాజుకు ఆనందం కలిగించే వార్త. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

Madras court gives Shankar a free hand from Indian 2 issue jsp
Author
Hyderabad, First Published Jul 4, 2021, 10:10 AM IST

‘ఇండియన్-2’ (భారతీయుడు-2) విషయమై గత కొంతకాలంగా దర్శకుడు శంకర్ కోర్టు చుట్టూ తిరుగతున్న సంగతి తెలిసిందే.  కొన్ని అనూహ్య కారణాల వల్ల 60 శాతం పూర్తైన ‘ఇండియన్-2’  సినిమా నిలిచిపోయింది. మరోవైపు శంకర్ తన తదుపరి ప్రాజెక్టులను కూడా ప్రకటించారు. అయితే ఒప్పందం ప్రకారం తమతో సినిమా పూర్తి చేయకుండానే వేరే సినిమాలు ప్రారంభించిన శంకర్‌పై లైకా ప్రొడక్షన్స్ కోర్టులో కేసు వేసింది. 

`అప‌రిచితుడు` మొద‌లెట్టిన రోజే.. మ‌రో షాక్ త‌గిలింది. నిర్మాత ర‌విచంద్ర‌న్ శంక‌ర్ పై నిప్పులు చెరిగారు. భార‌తీయుడు 2 పూర్త‌య్యేంత వ‌ర‌కూ.. రామ్ చ‌ర‌ణ్ సినిమాని ప‌ట్టాలెక్కించడం ఇప్పుడు క‌ష్టంగా మారింది. `అప‌రిచితుడు` హిందీ రీమేక్ మొద‌ల‌వుతుందో, లేదో ఇంకా తెలీదు. ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంటే అర్దం కాని పరిస్దితి. వాదోపవాదాలు అనంతరం ఈ విషయమై మద్రాసు హై కోర్టు తీర్పు వచ్చింది.   

మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం..శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ వారి ఆరోపణలు అన్ని కోర్టు కొట్టివేశింది. అంతేకాకుండా శంకర్ ఏ విధమైన డబ్బుని లైకాకు ఇవ్వక్కర్లేదని, ఆయనకు ఇష్టమైన సినిమాలు చేసుకోవచ్చు అని తేల్చి చెప్పింది. దాంతో శంకర్ ఊపిరి పీల్చుకున్నారు.

 ఓరకంగా ఇది రామ్ చరణ్ కు,దిల్ రాజుకు ఆనందం కలిగించే వార్త. ప్రముఖ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

ఇక శంకర్ తో చెర్రీ చేసే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉండనుందని టాక్ కాగా ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఉన్నదట. ఆపాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను ఎంపిక చేసేపనిలో ఉన్నారని అంటున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరోకాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ నేపథ్యంలో శంకర్ – చరణ్ లతో ఉన్న పరిచయాలతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు సల్మాన్ ఒప్పుకోకపోయినా ఎవరో ఒకరు స్టార్ హీరోతోనే ఆ పాత్రను చేయించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన చరణ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్ ఈ మూవీలో కొమురం భీం గా కనిపించనున్నాడు. ఈసినిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడు రామ్ చరణ్.

Follow Us:
Download App:
  • android
  • ios