స్లమ్‌డాగ్ మిలియనీర్‌ సినిమాలో చేసిన నటుడు మధుర్ మిట్టల్‌ గుర్తుండే ఉండి ఉంటారు. ఆయనకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయనపై ముంబై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసారు. స్లమ్‌డాగ్‌లో ఈయన సమీర్ మాలిక్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసాడు మధుర్ మిట్టల్. ఈయన తన మాజీ లవర్ పై లైంగిక వేధింపుల కేసులో బుక్ అయ్యాడు. తన మాజీ ప్రియురాలిని ఇంటికి వెళ్లి మరీ దాడి చేశాడని అమ్మాయి తరఫు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.

 2021 ఫిబ్రవరి 13 న ఈ సంఘటన జరిగిందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ముంబైలోని బాంద్రాలో మధుర్ మిట్టల్ ఆమెను కలిసాడు. అంతేకాదు ఆమెను నిందితుడు మద్యం తాగాలని బలవంతం చేసాడని ఫిర్యాదు తరఫు న్యాయవాది నిరంజని శెట్టి తెలిపాడు. అంతే కాకుండా ఫిబ్రవరి 11న ఆమె అతడితో అన్ని సంబంధాలను తెంచుకుందని.. రెండు రోజుల తర్వాత మధుర్ మిట్టల్ ఆమెపై దాడి చేశాడని లాయర్ తెలిపాడు.

 తన ఇంటికి వచ్చి దారుణంగా గాయ పరిచాడని లాయర్ పేర్కొన్నారు. ఆమె ముఖం, మెడ, ఛాతీ, పక్కటెముకలు, చేతులు, వీపు, చెవులు, కళ్ళపై గాయాలు అయ్యాయని తెలిపారు న్యాయవాది. అత్యాచారం, లైంగిక వేధింపులు కేసులు ఈయనపై బుక్ చేసారు పోలీసులు. ఐపిసి సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. మధుర్‌పై ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మధుర్ మిట్టల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్ జైపూర్‌లో ఉన్నాడు.