పవన్ కళ్యాణ్ దేవుడేంటి.. మంచి మనిషి అంతే : మాధవిలత

First Published 25, Mar 2018, 10:48 AM IST
madhavi latha supports pawan kalyan on his 3 marraiges
Highlights
  • ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్‌ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు
  • మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు​
  • పవన్ కళ్యాణ్ లీగల్‌గా అందరికీ విడాకులు ఇచ్చేసే మూడో పెళ్లి చేసుకున్నారు​

ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్‌ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ అయిన హీరోయిన్ మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.
పవన్ కళ్యాణ్ లీగల్‌గా అందరికీ విడాకులు ఇచ్చేసే మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన నిజంగా అన్యాయం చేసి ఉంటే, మోసం చేసి ఉంటే రేణు దేశాయ్ ఇప్పటికీ అంత గౌరవంగా ఎందుకు మాట్లాడుతుంది? నో కామెంట్స్ అని ఒకటే మాట చెప్పేది. ఆమె ఏ రోజూ అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఆమె చాలా ఎగ్జైట్ అవుతారు.... అని మాధవి లత తెలిపారు
అలా మాట్లాడుకుంటే మన రాజకీయ నాయకులు ఒక్క పెళ్లి చేసుకుని పది సంసారాలు మెయింటేన్ చేస్తున్నవారు ఉన్నారు.దాన్నేమంటారు? ఇవన్నీ అందరికీ తెలిసినవే. అంటే వాళ్లు ఇల్లీగల్‌గా చేస్తే తప్పులేదా? పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా చట్టప్రకారం విడాకులు ఇచ్చి చేస్తే తప్పా?... అంటూ మాధవి లత ప్రశ్నించారు.


దేవుళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదా? అలా అని పవన్ కళ్యాణ్‌ను నేను దేవుడు అనడం లేదు, ఆయన మంచి మనిషి... సమాజానికి మంచి చేయాలనుకుంటున్న మనిషి... దేవుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే కొందరు సందర్భం అలా కలిసొచ్చింది చేసుకున్నారని చెబుతుంటారు.పవన్ కళ్యాణ్‌కు కూడా అలాంటి సందర్భం కలిసొచ్చిందేమో? అక్కడ దేవుడు ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. ఒకరు ఉండగానే ఇంకొకరిని చేసుకున్నారు... అని మాధవి లత అన్నారు.


అంటే ప్రపంచంలో దేవుడికైనా ఇద్దరి భార్యల మధ్య ఇరుక్కుంటే నలిగిపోతారు, కలియుగం ఇలా నడవాలి అనే చెప్పడానికే సింబాలిక్ గా మన పురాణాల్లో అలా చెప్పారు.దాని మీద నేను ఏమీ కామెంట్ చేయడం లేదు. ఇపుడు మనకు రోడ్డుమీద ఏదైనా చిన్న హెల్ప్ అవసరం అయినపుడు ఒక మనిషి వచ్చి సహాయం చేయగానే అబ్బా దేవుడులా వచ్చారు అంటాం. మంచి చేయడానికి వచ్చారు కాబట్టి వారిని దేవుడు అంటాం అని మాధవి లత అన్నారు

loader