పవన్ నన్ను ఎప్పటికి వదలడు... ఆ నమ్మకం నాకు ఉంది

Madhavi latha comments on pawan kalyan
Highlights

పవన్ నన్ను ఎప్పటికి వదలడు... ఆ నమ్మకం నాకు ఉంది

 న‌చ్చావులే సినిమా ద్వారా సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన మాధ‌వీల‌త ఆ త‌రువాత అడ‌పా ద‌డ‌పా సినిమా అవ‌కాశాలు వ‌చ్చినా చివ‌ర‌కు వెండి తెర‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే.ఇదిలా ఉండ‌గా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైన కామెడీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మాధ‌వీ ల‌త జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను మ‌రోసారి చాటుకుంది. అయితే, అదే ప్రోగ్రామ్‌లో మాధ‌వీల‌త‌తోపాటు హైప‌ర్ ఆది కూడా పాల్గొన్నాడు. ప్రోగ్రామ్‌లో భాగంగా మాధ‌వీ ల‌త‌కు హైప‌ర్ ఆది ల‌వ్ ప్రపోజ్ చేశాడు. 

అయితే, ఎంత‌కీ మాధ‌వీ ల‌త హైప‌ర్ ఆదికి రెస్పాండ్ కాక‌పోవడంతో.. ఒక్క హ‌గ్ ఇస్తే ప‌డిపోతావ్ అంటూ హైప‌ర్ ఆది అన‌డంతో.. ఒక్క‌సారిగా స్పందించిన మాధ‌వీ ల‌త నేను ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్ర‌మే హ‌గ్ ఇస్తా, మ‌రెవ్వ‌రికీ కూడా నేను హ‌గ్ ఇవ్వ‌ను అంటూ స‌మాధాన‌మిచ్చింది. అంతేకాకుండా, ప‌వ‌న్ క‌ల్యాన్‌ను ప్రేమించే వాళ్లు కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారన్న హైప‌ర్ ఆది ప్ర‌శ్న‌కు మాధ‌వీల‌త స్పందిస్తూ.. కృష్ణుడ్ని రాథా మాత్ర‌మే కాదు, గోపికలంద‌రూ కూడా ప్రేమించారు అంటూ స‌మాధాన‌మిచ్చింది. అంతెందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికీ నా ప‌క్క‌నే ఉన్నాడు.. నాకు మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌న్నెప్ప‌టికీ మోసం చేయ‌డు అంటూ మాధ‌వీల హైప‌ర్ ఆదికి స‌మాధాన‌మిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

loader