అఫీషియల్ : 'మ్యాడ్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'మ్యాడ్' సినిమాకు యూత్ నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కథ లేకపోయినా యూత్ కు నచ్చే కథాంశం ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కనక వర్షాన్ని కురిపించింది. తెలుగులో నెంబర్ వరన్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత మంది నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు. వారంతా కలిసి మ్యాడ్‌లో చేసిన హంగామా బాగానే వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో OTT ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని నవంబర్ 3 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది. థియేటర్లలో విజిల్స్ వేయించిన ఈసినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే నవీన్ నోలి ఎడిటర్ గా పని చేసిన ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు.
చిత్రం కథేంటంటే: మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE) విద్యార్థులు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి మంచి స్నేహితులవుతారు. మనోజ్ శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్ ఇష్టపడుతుంటుంది. దామోదర్ అలియాస్ డీడీకి గుర్తుతెలియని వెన్నెల అనే అమ్మాయి లవ్ లెటర్ రాసి తనను ప్రేమలో పడేలా చేస్తుంది. హాస్టల్‌కు ఫోన్ చేసి రోజూ డీడీతో ప్రేమగా మాట్లాడుతుంటుంది. వెన్నెలను చూడకుండానే డీడీ నాలుగేళ్లు గడిపేస్తాడు. చివరకు వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మధ్యలో లడ్డు(విష్ణు) కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.