Asianet News TeluguAsianet News Telugu

‘‘మ్యాడ్‌’’షాకింగ్ కలెక్షన్స్ .. 2 రోజుల్లోనే లాభాలు

రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 2.40 కోట్లు షేర్, రూ. 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్స రాబట్టింది. కాబట్టి సినిమా రెండు రోజుల్లోనే బ్లాక్ బస్టర్ క్రింద లెక్క. 

 

Mad Movie 2 Days Worldwide Box Office Collection jsp
Author
First Published Oct 8, 2023, 4:15 PM IST

 
మొన్న శుక్రవారం రిలీజైన 'మ్యాడ్' చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కల్యాణఅ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ చిన్న చిత్రంపై పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేకపోయినా పెద్ద బ్యానర్ నుంచి సనిమా రావటం, స్టార్స్ చేసిన  పబ్లిసిటీ సినిమాకు బాగా ప్లస్సైంది. దాంతో ఓపినింగ్స్ బాగా వచ్చాయి. అలాగే మీడియా సైతం సినిమాకు బాగా సపోర్ట్ చేసింది. ఈ నేపద్యంలో చిత్రం కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయని ట్రేడ్ టాక్. 

మ్యాడ్ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 70 లక్షల షేర్ కలెక్షన్స్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 95 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.  2వ రోజున తెలుగు రాష్ట్రాల్లో టాక్ బాగా రావటంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. నైజాం, సీడెడ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 1.05 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే రెండు రోజుల్లో మొత్తంగా రూ. 1.75 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. 

 మ్యాడ్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు రూ. 1.45 షేర్, రూ. 2.80 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.   అలాగే ఓవర్సీస్‌లో రెండు రోజులకు 120K ప్లస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. అంటే రూ. 99 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.  మ్యాడ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 2.40 కోట్లు షేర్, రూ. 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్స రాబట్టింది. కాబట్టి సినిమా రెండు రోజుల్లోనే బ్లాక్ బస్టర్ క్రింద లెక్క. 

Mad Movie 2 Days Worldwide Box Office Collection jsp

 
స్టోరీ లైన్  : 

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అశోక్ (నార్నే నితిన్), మనోజ్ (రామ్ నితిన్), డీడీ  (సంగీత్ శోభన్). మొదటి రోజడు నుంచే  వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు.  వీరితో పాటుగా లడ్డు అనే కుర్రాడు కూడా కలిసి తిరుగుతూంటాడు. అశోక్  ఇంట్రావర్ట్ ఉంటూంటాడు! అశోక్ ని  జెన్నీ (అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్ కూడా మనస్సులో  జెన్నీని ఇష్టడుతుంటాడు. కానీ ఒకరికొకరు చెప్పుకోరు. అదో లవ్ స్టోరీ. మరో ప్రక్క  మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయిని  ఫ్లర్ట్ చేస్తూంటాడు. ఇలాంటి పులిహార కుర్రాడికి ... శృతి (శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)కనపడ్డాక నిజంగానే ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంతో ఆమె అతన్ని దూరం పెట్టి యుఎస్ వెళ్లిపోతుంది. 

 ఇక డీడీ ది మరో టైప్ .  తనకు అమ్మాయిలు ఏ అమ్మాయిలు పడరు అని దూరంగా ఉంటూంటాడు.సింగిల్ లైఫే సో బెటర్ అని పాటలు పాడుతూంటాడు.  అతనికి  ఓ అజ్ఞాత ప్రేమికురాలు లాంటి ఓ అమ్మాయి లవ్ లెటర్ రాస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో రివీల్ కాదు. దాంతో ఆ అమ్మాయి ఎవరా అని వెతుకుతూంటాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి అనేది ఓ షాక్ అయ్యే ట్విస్ట్ తో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా... మరో ప్రక్క మనోజ్ ప్రేమ కథలో అపార్దాలు తొలిగాయా...ఈ కథలో రాధ (గోపికా ఉదయన్) క్యారక్టర్ ఏమిటి...  అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios