Asianet News TeluguAsianet News Telugu

మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ రాజీనామా లేఖలో ఏం రాశారంటే..?

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందిన తర్వాత మెగా బ్రదర్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో తన రాజీనామా లేఖ పోస్టు చేశారు. మా అసోసియేషన్ సభ్యులపై ఇందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

mega brother nagababu resigned to MAA
Author
Hyderabad, First Published Oct 11, 2021, 9:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

‘మా’ ఎన్నికల ఫలితాలు సరికొత్త ట్విస్టులను ఇస్తున్నాయి. MAA అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్‌పై manchu vishnu గెలుపొందారు. ఈ నేపథ్యంలో prakash raj ప్యానెల్‌కు మద్దతునిచ్చిన వారు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. mega brother nagababu తన resignationను ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ లేఖలో సంచలన విషయాలు రాసుకొచ్చారు.

నిష్పక్షపాత, విభిన్నత కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీరును తాను ఎప్పుడూ అభిమానించేవాడని, సంస్కృతులు, ప్రాంతాలకు అతీతంగా కళాకారులను అక్కున చేర్చుకుని ‘మా’ ఒక సొంతిళ్లుగా నిలిచిందని నాగాబాబు తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. తాను గతంలో ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో గతంలో పోటీ చేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలిపారు. కానీ, ఇటీవలి కాలంలో ‘మా’ సభ్యుల్లో అటు కళాకారులుగా ఇటు మనుషులుగా అనూహ్య మార్పులు వచ్చాయని, ఈ అసహ్యకరమైన మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయని వివరించారు.

Also Read: చిరంజీవి నన్ను విత్‌ డ్రా చేసుకోమన్నారుః మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు.. `మా`లో మరో చిచ్చు

ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వ ధోరణులతో సభ్యులు ఎంతగా మారిపోయారో ఈ ఎన్నికలు తన లాంటివారికి కనువిప్పు కలిగించాయని నాగబాబు తెలిపారు. బలగం, ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని ఆరోపించారు. ఇలాంటి హిపోక్రైట్స్, స్టీరియోటైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగలాని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రాంతతత్వం, మతతత్వాలతో అసోసియేషన్ సొంత గోతి తవ్వుకుంటున్నదని, అందుకే గుడ్ బై చెప్పడం అనివార్యమైందని వివరించారు. 

గౌరవనీయులైన ప్రకాశ్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. ఆయన ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా గల అచంచల వ్యక్తి అని ప్రకాశ్‌ రాజ్‌ను ప్రశంసించారు. తాను గత పరిణామాలపట్ల బాధపడటం లేదని, అసోసియేషన్ భవిష్యత్‌పైనే ఆందోళన చెందుతున్నట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios