Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలయ్యాకా.. ఒక్కొక్క ‘‘లం..***’’ కొడుకు సంగతి చూస్తానన్నారు : నరేశ్‌పై ఉత్తేజ్ ఘాటు వ్యాఖ్యలు

ఎన్నికలు జరిగేటప్పుడు.. తన ముఖంలో ముఖం పెట్టి.. ఒక్కొక్క ‘‘లం..***’’ కొడుకు పనిచెప్తానంటూ నరేశ్ వార్నింగ్ ఇచ్చాడని మండిపడ్డారు. తన తల్లిని తిట్టడానికి వాడేవడూ అంటూ ఉత్తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

maa elections uttej sensational comments on naresh
Author
Hyderabad, First Published Oct 12, 2021, 6:54 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తన భార్య పద్మ లేకపోవడం వల్ల మా  ఎన్నికల్లో ఎవరినీ తాను ఓటు అడగలేదని... మెసేజ్ కూడా చేయలేదంటూ ఉద్వేగానికి గురయ్యానన్నారు ఉత్తేజ్. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన 11 మంది సభ్యులు మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తేజ్ మాట్లాడుతూ.. తనకు 300 మంది ఓట్లు వేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్‌కు, 1895‌లో సినిమాను అందించిన లూమియర్ బ్రదర్స్‌కు పాదాభివందనమన్నారు. అలాగే మాయాబజార్‌ని గొప్పగా అందించిన మార్కస్ బాట్లేకు సెల్యూట్ చెప్పారు ఉత్తేజ్. వీళ్లేవరూ లోకల్ కాదని.. మన నెగిటివ్, ఈస్ట్‌మన్ కలర్, సినిమా అన్న పదమే లోకల్ కాదని.. అలాంటిది లోకల్ అని నాన్ లోకల్ అనే ఇష్యూ తీసుకొచ్చారని ఉత్తేజ్ ఆరోపించారు.

ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమాకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రకాశ్ రాజ్ వస్తే.. ఆయన వెంట తామందరం నడిచామన్నారు. శివాజీరాజా ప్రెసిడెంట్‌గా వున్నప్పుడు నరేశ్ జనరల్ సెక్రటరీగా వున్నారని... ఈ సందర్భంగా నాటకోత్సవాలు జరిపించామని  గుర్తుచేశారు. అప్పుడు మా భవనానికి డోర్, కిటీకి వచ్చినా చాలని బస్సుల్లో శ్రీకాంత్, తాము తిరిగామన్నారు. కెమెరాలు, నాటకం జరిగేటప్పుడు ఎవరైనా వాటికి అడ్డొస్తే తిడతామని.. కానీ నరేశ్ సెంటర్‌లో సీటు వేసుకుని ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని దోమలు కూడుతున్నాయని మందు రాసుకున్నారని ఉత్తేజ్ ఎద్దేవా చేశారు. ఇది చూసిన తాము నరేశ్‌కి చెప్పేందుకు ప్రయత్నిస్తే.. తాను ఇక్కడ దోమల మందు రాసుకుంటున్నా వెళ్లు అంటూ గద్దించారని ఉత్తేజ్ చెప్పారు. ఎన్నికలు జరిగేటప్పుడు.. తన ముఖంలో ముఖం పెట్టి.. ఒక్కొక్క ‘‘లం..***’’ కొడుకు పనిచెప్తానంటూ వార్నింగ్ ఇచ్చాడని మండిపడ్డారు. తన తల్లిని తిట్టడానికి వాడేవడూ అంటూ ఉత్తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALso Read:నేను మోహన్ బాబు ఇంట్లోనే పెరిగా.. కానీ మా అమ్మని తిడితే : తనీష్ ఎమోషనల్

ఎన్నికలు జరిగిన తర్వాత బయో మెట్రిక్ పెట్టారని.. మమ్మల్నే రానీయకపోతే ఎలా అంటూ అప్పుడే వార్నింగ్ ఇచ్చారని మండిపడ్డారు. అమెరికాలో చిరంజీవి పాల్గొన్న ఒక ఈవెంట్స్‌లో లెక్కలు తప్పున్నాయని చెప్పడం వల్ల మిగిలిన హీరోలు రాలేదని ఉత్తేజ్ ఆరోపించారు. పోలింగ్ రోజున ఓటర్స్ వెళుతూ వుంటే బారికేడ్లు అడ్డుగా పెట్టారని .. ఆ వెంటనే శ్రీకాంత్ కలగజేసుకుని ఇప్పుడే వేరు వేరు అనుకుంటున్నారని చెబితే అలాగే వుండాలంటూ గద్దించారని ఉత్తేజ్ చెప్పారు. ఎన్నికల అధికారికి, అటు టీమ్ వాళ్లకి ఎల్లో కార్డే వుందని.. దీని వల్ల ఎవరు ఎవరనే విషయం తెలియలేదన్నారు. బెనర్జీ కళ్ల వెంట నీళ్లు తాను చూడలేదని.. తనను పక్కకి నెట్టేశారని ఉత్తేజ్ చెప్పారు.

పోలింగ్ రోజే మా పరిస్ధితి ఇలా వుంటే.. రేపు చాలా కష్టమని.. తిరుపతిలో పెద్ద విశ్వవిద్యాలయాన్నే నడిపించే విష్ణుకు మా అధ్యక్ష పదవి పెద్ద కష్టం కాదన్నారు. ఆయన వెనుక నాన్న వున్నారని.. చరిత్ర వుందని, తెలుగు సినిమా వైభవం వుందంటూ సెటైర్లు వేశారు. తన భార్య చావు బతుకుల మధ్య వుంటే... చిరంజీవి మొదలుకొని ప్రకాశ్ రాజ్, జీవిత, శ్రీకాంత్, బెనర్జీ వంటి పెద్దలంతా ఆసుపత్రిలోనే వున్నారని ఉత్తేజ్ ఎమోషనల్ అయ్యారు. నరేశ్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేని.. తాము కళాకారులమని, చెయ్యి వేస్తే పొంగిపోతామని ఆయన అధ్యక్షుడిగా వున్న తాను ఈసీ మెంబర్‌నని గుర్తుచేశారు. ఒక ఈసీకే కష్టమొస్తే పరామర్శ లేదని .. సభ్యులకేం పరామర్శ చేస్తావంటూ ఉత్తేజ్ మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios