Asianet News TeluguAsianet News Telugu

MAA elections ఇంత అలజడి సరికాదు, ఎన్నికలు ఏకగ్రీవం కావాల్సింది.. దర్శకేంద్రుడు కీలక వ్యాఖ్యలు

సీనియర్ దర్శకులు కే రాఘవేంద్ర రావు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. MAA elections పై మొదటిసారి స్పందించిన దర్శకేంద్రులు   ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు.

maa elections senior director k raghavedra rao made interesting comments
Author
Hyderabad, First Published Oct 12, 2021, 2:30 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా.. వేడి మాత్రం చల్లారలేదు. దాదాపు రెండు నెలలుగా మా ఎన్నికల కారణంగా పోటీలో నిలిచిన, వాళ్లకు మద్దతు తెలిపిన సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రత్యక్షంగా వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. ఒకరినొకరు కించచపరుచుకుంటూ.. మీడియా వేదికగా రచ్చ చేశారు. 


ఎన్నికల అనంతరం అయినా ఈ రభస ముగుస్తుంది అనుకుంటే.. ఆ పరిస్థితులేమీ కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు మానసిక వేదనకు గురి చేశాయంటూ Prakash raj ప్యానెల్ కి మద్దతుగా ఉన్న నాగబాబు, మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే ప్రకాష్ రాజ్ సైతం మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో నటుడు శివాజీ రాజా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుకు అల్టిమేటం జారీ చేశారు. గత అధ్యక్షుడు నరేష్ పై విచారణ కమిటీ వేయాలని, లేకుంటే.. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరించారు. 


ఇక అధ్యక్షుడిగా గెలిచిన Manchu vishnu, ఆయన తండ్రి మోహన్ బాబు మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ కొన్ని ఆరోపణలు చేశారు. పరిశ్రమ  గౌరవం, ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్న పెద్దలు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలు వివాదాలకు కారణం అవుతున్న మా ఎన్నికల నిర్వహణ లేకపోతే మంచిది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ పెద్దలు అందరూ కూర్చొని అధ్యక్షుడితో పాటు.. మా కమిటీ మెంబర్స్ ని ఎన్నుకోవడం ఆరోగ్యకరమైన ప్రక్రియ అంటున్నారు. 

Alsor read దిల్ రాజు ఆఫర్ రిజెక్ట్ చేసిన రాఘవేంద్ర రావు.. బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్..


సీనియర్ దర్శకులు కే రాఘవేంద్ర రావు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. MAA elections పై మొదటిసారి స్పందించిన దర్శకేంద్రులు   ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు. ఎన్నికల్లో ఇంత అలజడి సృష్టించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సినీ పెద్దలు అంతా కలిసి మా అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుని.. ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది. నిజానికి అదే మంచి పద్దతి అన్నారు. అదే సమయంలో  అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు సక్సెస్ ఫుల్ గా మా అసోసియేషన్ ని నడుపుతారన్న ధీమా... వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios